రేపు బెంగాల్‌ వెళ్లడంలేదు.. మోదీ ట్వీట్‌

తాజా వార్తలు

Updated : 22/04/2021 18:53 IST

రేపు బెంగాల్‌ వెళ్లడంలేదు.. మోదీ ట్వీట్‌

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రేపటి బెంగాల్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు. దేశంలో కరోనాతో నెలకొన్న పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్షల్లో పాల్గొనాల్సి ఉన్నందున  బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనడంలేదు.  కరోనా పరిస్థితిపై ఉన్నత స్థాయి సమావేశాలకు అధ్యక్షత వహించాల్సి ఉండటంతో శుక్రవారం బెంగాల్‌కు వెళ్లడంలేదని ప్రధాని ట్వీట్‌ చేశారు. బెంగాల్‌ అసెంబ్లీకి ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా.. నేడు ఆరో విడత పోలింగ్ పోలింగ్‌ పూర్తయింది. నాలుగు జిల్లాల పరిధిలో 43 నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 5.30గంటల వరకు దాదాపు 79శాతం పోలింగ్‌ నమోదైంది.

దేశంలో కరోనా పరిస్థితిపై శుక్రవారం ఉదయం 9గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన అంతర్గత సమావేశం జరగనుంది. ఆ తర్వాత 10గంటలకు కరోనా అత్యధిక ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, 12.30గంటలకు ఆక్సిజన్‌ ఉత్పత్తిదారులతో ప్రధాని సమావేశం కానున్నారు.  

మరోవైపు, దేశంలో కొత్తగా 3లక్షలకు పైగా కొవిడ్‌ కేసులు, 2వేలకు పైగా మరణాలు నమోదు కావడం కలకలం రేపుతోంది. పలు రాష్ట్రల్లో ఆక్సిజన్‌ కొతర ఏర్పడిన వేళ ఈ సాయంత్రం ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి, సరఫరా తదితర అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆక్సిజన్‌ సరఫరా సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని