Afghan situation: చైనా, రష్యా ఇంటెలిజెన్స్ వర్గాలతో ఐఎస్‌ఐ చీఫ్‌ రహస్య భేటీ!

తాజా వార్తలు

Published : 12/09/2021 01:11 IST

Afghan situation: చైనా, రష్యా ఇంటెలిజెన్స్ వర్గాలతో ఐఎస్‌ఐ చీఫ్‌ రహస్య భేటీ!

దిల్లీ: తాలిబన్ల నేతృత్వంలోని అఫ్గాన్‌ ప్రభుత్వంతో సత్సంబంధాలపై పలు దేశాల ఉన్నతాధికారులతో పాక్‌ ఐఎస్‌ఐ చీఫ్‌ రహస్యంగా భేటీ అయినట్లు సమాచారం. చైనా, రష్యా, ఇరాన్, కజకిస్థాన్‌, తజికిస్థాన్‌, తుర్కెమెనిస్థాన్‌ దేశాల ఇంటెలిజెన్స్‌ అధికారులతో పాకిస్థాన్‌ ఇంటెల్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) డైరెక్టర్‌ జనరల్‌ ఫయాజ్‌ హమీద్‌ ఇస్లామాబాద్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తాలిబన్ల పిలుపు మేరకు కాబుల్‌ వెళ్లి వచ్చిన తర్వాత ఫయాజ్‌ హమీద్‌ ఈ భేటీ ఏర్పాటు చేయడం పలు ఊహాగానాలకు తెరలేపుతోంది.

నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. అఫ్గాన్‌లోని ప్రస్తుత పరిస్థితులపై ఆయా దేశాలు చేపట్టబోయే చర్యలతోపాటు తాలిబన్ల అధ్యక్షతన అఫ్గాన్‌తో పాక్‌ నెలకొల్పే సత్సంబంధాలను చర్చించినట్లు సమాచారం. అఫ్గాన్‌తో ఆర్థిక, వాణిజ్య పరమైన సంబంధాలపై సుదీర్ఘ చర్చలు సాగించారు. రష్యా మినహా మిగతా ఐదు దేశాల విదేశాంగ మంత్రులు ఇదే అంశంపై గతవారం విస్తృత చర్చలు నిర్వహించారు.

పాకిస్థాన్‌, చైనాతోపాటు మరికొన్ని దేశాలు తాలిబన్లకు మొదటినుంచి మద్దతిస్తున్నాయి. తాలిబన్ల పాలనకు అనుకూలంగానే మాట్లాడుతూ వస్తున్నాయి. పలు దేశాలు తాలిబన్లకు ఆయుధాలు సరఫరా చేశాయని, ఆర్థిక సాయం అందించాయని వార్తలు కూడా వచ్చాయి. అఫ్గానిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఈమధ్యే తమ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా.. పాకిస్థాన్‌, చైనా, రష్యా, టర్కీ, కతర్‌, ఇరాన్‌ దేశాలకు ఆహ్వానం కూడా పంపించారు. అయితే పలు కారణాలతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిలిపివేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని