రాహుల్‌ గురించి ఒబామా ఏమన్నారంటే!

తాజా వార్తలు

Updated : 13/11/2020 12:03 IST

రాహుల్‌ గురించి ఒబామా ఏమన్నారంటే!

పుస్తకంలో సోనియా, మన్మోహన్‌ల ప్రస్తావన కూడా..

న్యూయార్క్‌: పని పూర్తిచేసి ఉపాధ్యాయుడి మెప్పును పొందాలని విద్యార్థి ఎలా ఆరాటపడతారో అలాంటిదే తప్పిస్తే ప్రావీణ్యం సంపాదించాలనే తపన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీలో లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా వ్యాఖ్యానించారు. స్పష్టత గానీ, ధైర్యం గానీ ఆయనలో కనిపించదన్నారు. ‘ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’ పేరుతో ఒబామా పుస్తకం రాశారు. దీనిలో ప్రపంచంలోని వివిధ దేశాల నేతల గురించి ప్రస్తావించారు. ఈ పుస్తకాన్ని ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రిక సమీక్షించింది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రస్తావన ఈ పుస్తకంలో ఉంది. ‘భావరహితంగా కనిపించే నిజాయతీపరుల’ గురించి ఒకచోట చెబుతూ వారిలో భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఒకరని అన్నారు. ఈ పుస్తకం ఈ నెల 17న మార్కెట్లోకి రానుంది. ఒబామా బాల్యం, రాజకీయ ప్రస్థానం గురించి దీనిలో రాశారు. 2010, 2015లలో ఆయన భారత్‌లో పర్యటించారు. 
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని