హెర్డ్‌ ఇమ్యూనిటీ ఈ ఏడాది అసాధ్యమే!

తాజా వార్తలు

Updated : 12/01/2021 13:57 IST

హెర్డ్‌ ఇమ్యూనిటీ ఈ ఏడాది అసాధ్యమే!

వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ టీకా కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ..ఈ ఏడాదే హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరించింది. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు సుమారు నెల రోజులక్రితమే టీకా కార్యక్రమాన్ని ప్రారంభించాయి. భారత్‌ కూడా జనవరి 16 నుంచి భారీ టీకా కార్యక్రమానికి సిద్ధం అవుతోంది. ఇంకోవైపు, పలు దేశాల్లో ముఖ్యంగా ఐరోపాలో వైరస్ విశ్వరూపం చూపిస్తోంది. ఈ క్రమంలో ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

‘మనం 2021లోనే హెర్డ్ ఇమ్యూనిటీని సాధించడం అసాధ్యం. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తగినన్నీ డోసులను సిద్ధం చేయడానికి సమయం పడుతుంది. భౌతిక దూరం, చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్కులు ధరించడం అత్యంత అవసరం’ అని సౌమ్యా స్వామినాథన్ స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే తొమ్మిది కోట్ల మందికి పైగా కరోనా వైరస్‌ బారినపడ్డారు. మరణాల సంఖ్య 20లక్షలకు చేరువవుతోంది. పలు దేశాల్లో కరోనా కొత్త రకాలు వెలుగుచేస్తున్నాయి. వాటి వ్యాప్తి కూడా వేగంగా ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట యూకేలో వెలుగుచూసిన కొత్త రకం ఆ దేశంలో పాజిటివ్ కేసులు పెరుగుదలకు కారణమవుతోంది. ఆ కారణంగా ప్రధాని బోరిస్ జాన్సన్ మరోసారి లాక్‌డౌన్ ప్రకటన చేయాల్సి వచ్చింది. దక్షిణాప్రికా రకం కూడా పలు దేశాలకు వ్యాపించింది. యూఎస్‌లో ఉత్పర్తివర్తన చెందిన వైరస్ బయటపడిందని అక్కడి యంత్రాంగం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దాని వ్యాప్తి 50 శాతం అధికమని ఆందోళన వ్యక్తం చేసింది. 

ఇవీ చదవండి:

వుహాన్‌ ప్రపంచంలోనే సురక్షితమైన నగరం!

యోధుల టీకా ఖర్చు కేంద్రానిదేAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని