నావల్నీపై విషప్రయోగ ఆనవాళ్లు లభించలేదు 

తాజా వార్తలు

Published : 21/08/2020 22:42 IST

నావల్నీపై విషప్రయోగ ఆనవాళ్లు లభించలేదు 

మరికొన్ని పరీక్షలు నిర్వహించాలని వైద్యుల వెల్లడి

మాస్కో: రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ రక్త, మూత్ర పరీక్షల్లో ఎలాంటి విష ప్రయోగపు ఆనవాళ్లు లభించలేదని వైద్యులు పేర్కొన్నారు. ఇంకా పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రి డిప్యూటీ చీఫ్‌ ఫిజీషియన్‌ కలినిచెంకో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ‘నోవల్నీకి అన్ని రకాలు పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు నిర్వహించిన రక్త, మూత్ర పరీక్షల్లో ఎలాంటి విష ప్రయోగ ఆనవాళ్లు బయటపడలేదు’ అని పేర్కొన్నారు.

అలెక్సీ నావల్నీ గురువారం సైబీరియాలోని తోమస్క్‌ నగరం నుంచి మాస్కోకు విమానంలో ప్రయాణిస్తూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో విమానాన్ని అత్యవసరంగా మధ్యలోనే తోమస్క్‌లో దించి హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచగానే ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. నోవల్నీని చంపేందుకు విమానంలో టీలో విషం కలిపి ఇచ్చారని విపక్షాలతోపాటు మీడియా సంస్థలు, నోవల్నీ యాంటీ కరప్షన్‌ ఫౌండేషన్‌ ఆరోపిస్తున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని