Mixed Vaccines: వ్యాక్సిన్‌ల మిక్సింగ్‌ కోసం ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు

తాజా వార్తలు

Published : 03/08/2021 23:58 IST

Mixed Vaccines: వ్యాక్సిన్‌ల మిక్సింగ్‌ కోసం ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు

దిల్లీ: కరోనా వ్యాక్సిన్ల మిక్సింగ్‌ కోసం ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి వెల్లడించారు. కొవిడ్‌ వ్యాక్సిన్ మిక్సింగ్‌ మంచి ఫలితాలను ఇస్తోందని ఇప్పటివరకు ఏ అధికారిక ప్రకటన వెలువడలేదని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు భారత్‌లో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌, స్పుత్నిక్‌ టీకాలను అందిస్తున్నారు. కాగా మిక్స్‌డ్‌ డోసు టీకాలు ఇస్తే మంచి ఫలితాలు వస్తాయని ఎలాంటి రుజువులు లేవని రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ మొదటి, రెండు డోసులను కలిపి అవసరమైన వ్యక్తులకు ఇవ్వగలరా? దీనిపై అధ్యయనాలు నిర్వహించారా? టీకా మిక్సింగ్ వల్ల ప్రతికూల ప్రభావం ఉండదని శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా? అని రాజ్యసభలో లేవనెత్తిన ప్రశ్నకు భారతి ప్రవీణ్ పవార్ సమాధానమిచ్చారు. వ్యాక్సిన్‌పై ఏర్పాటు చేసిన నిపుణుల బృందం కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని