Covid: గర్భిణికి నెగెటివ్‌.. పుట్టిన బిడ్డకు కరోనా 

తాజా వార్తలు

Published : 28/05/2021 11:28 IST

Covid: గర్భిణికి నెగెటివ్‌.. పుట్టిన బిడ్డకు కరోనా 

వారణాసి: గర్భంతో ఉన్న మహిళకు కరోనా సోకినా.. ప్రసవం తర్వాత బిడ్డలో వైరస్‌ లక్షణాలు అత్యంత అరుదుగా కన్పిస్తాయని వైద్య నిపుణులు తెలిపారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఇందుకు భిన్నమైన ఘటన చోటుచేసుకుంది. తల్లికి వైరస్‌ లేకున్నా.. పుట్టిన బిడ్డకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో వైద్యులు షాకయ్యారు. 

వారణాసిలోని కంటోన్మెంట్‌ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల మహిళ డెలివరీ కోసం మే 24న స్థానిక బనారస్‌ హిందూ యూనివర్శిటీ ఆసుపత్రిలో చేరింది. అప్పుడు వైద్యులు ఆమెకు కరోనా పరీక్షలు చేయగా.. నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మే 25న ఆ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన శిశువులో కరోనా లక్షణాలు కన్పించడంతో పరీక్షలు జరపగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యులు, కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు.

ఇది చాలా అసాధారణమైన ఘటన అని ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ కేకే గుప్తా అన్నారు. కొన్నిసార్లు పరీక్షల్లో పొరబాట్లు చోటుచేసుకుంటే ఇలా జరగొచ్చని.. తల్లీబిడ్డకు మరోసారి కరోనా టెస్టులు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం మహిళ, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని