close

తాజా వార్తలు

Published : 21/04/2021 11:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్‌కు మరో సమర్థ ఔషధం!

ఎలుకల్లో ప్రయోగాలు విజయవంతం

దిల్లీ: కొవిడ్‌-19కు చికిత్స చేయడం కోసం మరో ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చే దిశగా శాస్త్రవేత్తలు ఒక ముందడుగు వేశారు. ఇన్‌ఫ్లూయెంజాను నయం చేయడానికి గతంలో అభివృద్ధి చేసిన ఒక మందుకు కరోనా వైరస్‌ తీవ్రతను కట్టడి చేసే సామర్థ్యం ఉందని వారు పేర్కొన్నారు. ఈ మేరకు ఎలుకల్లో జరిగిన ప్రయోగాలు విజయవంతమయ్యాయని చెప్పారు. మానవులపైనా క్లినికల్‌ ప్రయోగాలు జరుగుతున్నాయని, అవి తుది దశలో ఉన్నాయని వివరించారు. 

మోల్నుపిరావిర్‌ (ఎంకే-4482) అనే ఈ ఔషధంపై అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఎన్‌ఐహెచ్‌), బ్రిటన్‌లోని ప్లైమౌత్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. కరోనా వల్ల బాధితుల ఊపిరితిత్తుల్లో కలిగే నష్టాన్ని కూడా ఇది తగ్గిస్తుందని వారు చెప్పారు. కరోనా వైరస్‌కు ప్రస్తుతం అనేకరకాల టీకాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఈ వైరస్‌ వల్ల సోకే ఇన్‌ఫెక్షన్‌ను నయం చేయడానికి అన్ని సమర్థ ఔషధాలు లేవన్నారు. అందువల్ల తాజా ఆవిష్కారం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందని వివరించారు. ప్రస్తుతం రెమ్‌డెసివిర్‌ అనే యాంటీవైరల్‌ ఔషధాన్ని కొవిడ్‌ చికిత్స కోసం ఉపయోగిస్తున్నప్పటికీ దాన్ని.. ఇంజెక్షన్‌ రూపంలోనే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అందువల్ల అది ఆసుపత్రుల్లోనే ఇవ్వాలని తెలిపారు. అందుకు భిన్నంగా ఎంకే-4482 ఔషధం మాత్ర రూపంలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దీన్ని ఎలుకల్లో ప్రయోగించినప్పుడు వాటిలో సాంక్రమిక వైరస్‌ స్థాయి వంద రెట్లు తగ్గినట్లు తేల్చారు. అలాగే మానవుల్లో వ్యాప్తిలో ఉన్న ఇతర కరోనా వైరస్‌లు, మెర్స్, సార్స్‌ వంటి వైరస్‌ల పునరుత్పత్తిని అడ్డుకునే సామర్థ్యం దీనికి ఉందని వెల్లడైంది.  

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని