Third wave: ‘థర్డ్‌వేవ్‌ వచ్చేసింది’ నేను అలా అనలేదు..

తాజా వార్తలు

Published : 08/09/2021 16:45 IST

Third wave: ‘థర్డ్‌వేవ్‌ వచ్చేసింది’ నేను అలా అనలేదు..

 

ముంబయి: మహారాష్ట్రలో ‘కరోనా థర్డ్‌ వేవ్‌ వచ్చేసింది’ అంటూ నిన్న చేసిన వ్యాఖ్యల విషయంలో ముంబయి నగర మేయర్‌ కిశోరి పెండేకర్‌ వెనక్కి తగ్గారు. మంగళవారం చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్న ఆమె.. కరోనా థర్డ్‌ వేవ్‌ మన ముంగిటే ఉందన్నారు. ‘ముంబయిలో థర్డ్‌ వేవ్‌ ఉందని నేను అనలేదు. మంత్రి నితిన్‌ రౌత్‌ నాగ్‌పూర్‌లో థర్డ్‌వేవ్‌ ఉన్నట్టు చెప్పారు. థర్డ్‌వేవ్‌ మన ఇంటి ముంగిటే ఉందని, అందుకు జాగ్రత్తలు అవసరం అని మాత్రమే నేను చెప్పా’’ అని ఆమె పేర్కొన్నారు. 

మరోవైపు ,‘థర్డ్‌వేవ్‌ రావడం కాదు.. అది ఇక్కడే ఉంది’ అంటూ నిన్న మేయర్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై మేయర్‌ కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. ముంబయి ప్రవేశ ద్వారం వద్దే కరోనా థర్డ్‌వేవ్‌ ఉందనేదే ఆమె ఉద్దేశమని స్పష్టంచేసింది. గత రెండు దశల్లో అనుభవాలను బట్టి.. అది మన చేతుల్లోనే ఉంది అని పేర్కొంది.

కరోనా ఇంకా పోలేదు.. గుర్తుంచుకోండి: ఆదిత్య ఠాక్రే

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కేసులు స్వల్పంగా పెరుగుతుండటంపై మంత్రి ఆదిత్య ఠాక్రే స్పందించారు. కరోనా ఇంకా పోలేదని మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటివరకు ఇంకా 12 నుంచి 18 ఏళ్ల వయసువారికి టీకాలు రాలేదన్నారు. పిల్లల్లో వైరస్‌ వ్యాప్తి చెందడంతో పాశ్యాత్య దేశాల్లోని చిన్న పిల్లల ఆస్పత్రులు నిండిపోతున్నాయన్నారు. థర్డ్‌ వేవ్‌ ముప్పు నుంచి బయటపడేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నామన్నారు. అందరూ కొవిడ్‌ నిబంధనల్ని పాటిస్తే.. థర్డ్‌వేవ్‌ రాకుండా ఆలస్యం చేయవచ్చన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని