కోడి..పిల్లల కోసం పాముతో పోరాటం

తాజా వార్తలు

Published : 20/06/2021 01:32 IST

కోడి..పిల్లల కోసం పాముతో పోరాటం

ఇంటర్నెట్‌డెస్క్‌: అమ్మప్రేమ వెలకట్టలేనిది. ప్రాణాపాయ పరిస్థితులు ఎదురైనప్పుడు తాను చనిపోయినా ఫర్వాలేదు.. పిల్లలు బతికితే చాలంటూ సంతోషంగా ప్రాణాలు విడిచేందుకు కూడా వెనకాడదు. కేవలం మనుషులు మాత్రమే కాదు.. పక్షులు, జంతువులు కూడా అంతే. ప్రాణాల మీదకు వచ్చినప్పుడు శత్రువు ఎంత బలవంతుడైనా పిల్లల్ని కాపాడుకునేందుకు తమ శక్తినంతటినీ కూడగట్టుకొని మరీ పోరాడుతాయి. సరిగ్గా అలాంటి ఘటనే టర్కీలో జరిగింది.

ఓ తాచుపాము కోడిపిల్లల సమూహంపై దాడి చేసేందుకు వెళ్లింది. అంతలో అది గమనించిన తల్లికోడి ఉన్నపళంగా పాముతో తలపడింది. అది బుసలు కొడుతూ బెదిరించినప్పటికీ ఏమాత్రం వెనుకంజ వేయలేదు. తాను ఏమైపోయినా ఫర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కాపాడుకోవాలనే ఉద్దేశంతో రెక్కలు పైకెత్తి, రెండు కాళ్లతో పాము పడగపై తన్నడం మొదలెట్టింది. దొరికిన చోటల్లా పొడుస్తూ పాముపై ఎదురుదాడి చేసింది. కాస్త వెనక్కి తగ్గిన పాము.. అదును చూసి కోడిపిల్లలపై దాడి చేసేందుకు మళ్లీ ప్రయత్నించింది. దీంతో కోపం పట్టలేని తల్లికోడి తన ముక్కుతో పామును విసిరేసింది. అయితే చివరికి పాము అక్కడి నుంచి పారిపోయిందా లేదా పాము కాటుకు గురైన తల్లికోడి ప్రాణాలు కోల్పోయిందా అనేది తెలియదు. దీనికి సంబంధించిన వీడియోను కోసల్‌ అకిన్‌ అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని