కూతురి కోసం... చిరుతతో పోరాటం

తాజా వార్తలు

Updated : 19/07/2021 06:40 IST

కూతురి కోసం... చిరుతతో పోరాటం

కుమార్తెను కాపాడుకున్న తల్లి

బల్లార్ష, న్యూస్‌టుడే : తన చిన్నారిని రక్షించుకునేందుకు ఏకంగా చిరుతపులితో పోరాడిందో మహిళ. మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు 8 కి.మీ. దూరంలోని జూనానా గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జునానా గ్రామంలో అర్చన మేశ్రమ్‌ అనే మహిళ రోజూ కూలీ చేసుకుంటూ పొట్టపోసుకుంటోంది. ఆమెకు అయిదేళ్ల కూతురు ప్రాజెక్త ఉంది. ఈనెల 1 తెల్లవారుజామున కుమార్తెను తీసుకుని బహిర్భూమికి వెళ్లింది. అక్కడ పొంచి ఉన్న చిరుత ప్రాజెక్తను ఈడ్చుకెళుతుండగా అర్చన కర్రతో వెంబడించింది. దీంతో చిరుత చిన్నారిని వదలి అర్చనపై దాడిచేసింది. ఆమె కర్రతో చిరుతపై తిరగబడగా చివరకు పులి అడవిలోకి వెళ్లిపోయింది. స్వల్పగాయాలైన అర్చన.. తీవ్రంగా గాయపడిన తన బిడ్డను చంద్రపూర్‌ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లింది. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు నాగ్‌పూర్‌ ఆసుపత్రికి తరలించారు. గత పదిరోజులుగా పరీక్షలు చేసిన వైద్యులు పాప దవడ పైభాగంలో ఎముకలు విరిగినట్లు గుర్తించారు. ఎడమ కనురెప్ప కూడా మూతపడటంలేదని నిర్ధారించారు. సోమవారం శస్త్రచికిత్స చేయనున్నట్లు వైద్యులు ఆదివారం వెల్లడించారు.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని