దేశప్రజలకు ప్రధాని దీపావళి శుభాకాంక్షలు

తాజా వార్తలు

Published : 14/11/2020 08:52 IST

దేశప్రజలకు ప్రధాని దీపావళి శుభాకాంక్షలు

దిల్లీ: దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిఒక్కరి జీవితంలో ఈ పండుగ మరిన్ని వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలంతా ఆరోగ్యంతో సుసంపన్నంగా జీవించాలని ప్రార్థించారు. 

‘‘అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ పండుగ మీ జీవితాన్ని మరింత ప్రకాశవంతంగా చేసి ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నాను. ప్రతిఒక్కరూ సుసంపన్నంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను’’. - నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

శనివారం నాటి దీపావళి పండుగను ప్రధాని ఎప్పటిలా దేశ సరిహద్దులోని సైనికులతో జరుపుకోబోతున్నట్టు సమాచారం. ‘దేశ సరిహద్దుల్లో నిరంతరం కాపలా కాస్తూ మనల్ని రక్షిస్తున్న సైనికులకు వందనం సమర్పిస్తూ ఈ దీపావళికి ఓ ప్రమిదను వెలిగించండి. వారి కుటుంబాలకు మనం రుణపడి ఉన్నాం’ అని ప్రధాని శుక్రవారం ట్వీట్‌ చేశారు.

మరోవైపు దీపావళి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పండుగను కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని సూచించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని