తెలుగులో భోగి శుభాకాంక్షలు చెప్పిన మోదీ

తాజా వార్తలు

Published : 13/01/2021 23:26 IST

తెలుగులో భోగి శుభాకాంక్షలు చెప్పిన మోదీ

దిల్లీ: నేడు భోగి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంద‌ర్భంగా మోదీ తెలుగులో ట్వీట్ చేయడం విశేషం. ‘‘ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక రోజు అంద‌రి జీవితాల్లోకి భోగ‌భాగ్యాల‌ను, ఆయురారోగ్యాల‌ను తీసుకురావాల‌ని ప్రార్థిస్తున్నాను’’ అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సైతం దేశ ప్రజ‌లంద‌రికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేర‌కు రాష్ట్రపతి కార్యాల‌యం ఒక ప్రక‌ట‌న విడుద‌ల చేసింది. ‘‘దేశ పౌరులంద‌రికీ లోహ్రీ, మ‌క‌ర సంక్రాంతి, పొంగ‌ల్‌, భోగాలి బిహూ, ఉత్తరాయ‌ణ్‌, పౌష్ ప‌ర్వదిన శుభాకాంక్షలు. ఈ పండుగ మ‌న స‌మాజంలో ప్రేమానురాగాలు, శాంతి సామ‌ర‌స్యాల‌ను మ‌రింత బ‌ల‌పడేందుకు తోడ్పడాలి. దేశంలో భోగ‌భాగ్యాల‌ను, సుఖ‌సంతోషాల‌ను పెంపొందించాలి’’ అని రాష్ట్రప‌తి  ఆకాంక్షించారు.

ఇవీ చూడండి..

అట్టహాసంగా భోగి పండగ - ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని