Corona: మెక్సికోలో మూడో దశ ప్రారంభం

తాజా వార్తలు

Updated : 11/07/2021 10:14 IST

Corona: మెక్సికోలో మూడో దశ ప్రారంభం

మెక్సికో సిటీ: మెక్సికోలో కరోనా మూడో దశ ప్రారంభమైందని ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటించింది. గతవారం నమోదైన కొవిడ్ కేసుల కంటే ఈ వారం 29 శాతం అధికంగా నమోదైనట్లు తెలిపింది. ఈ పెరుగుదల గతేడాది సెప్టెంబర్‌లో రెండో దశ ప్రారంభంతో పోలిస్తే చాలా అధికమని ఆందోళన వ్యక్తం చేసింది. మెక్సికోలో కరోనా మూడో దశ ఆగస్టులో గరిష్ఠస్థాయిని తాకుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

కొవిడ్‌ మూడో దశపై ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెస్‌ మానుయేల్‌ లోపెజ్‌ స్పందించారు. థర్డ్‌ వేవ్‌ ప్రభావం యువకులపైనే అధికంగా ఉంటుందని శాస్తవేత్తలు తెలిపినట్లు ఓ విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. కానీ మరణాల శాతం తక్కువగానే ఉంటుందని పేర్కొన్నారు. అధ్యక్షుడు మాట్లాడుతూ.. ‘పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు అధికమవుతున్నాయి. బాధితుల్లో అత్యధికులు యువతే. వారిలో రోగనిరోధకశక్తి అధికంగా ఉండటం వల్ల మరణాల శాతం తక్కువగా ఉంది. గతేడాది డిసెంబర్‌ నుంచే టీకాలు అందిస్తున్నాం. మరణాలు తక్కువగా నమోదవడానికి ఇది కూడా ముఖ్య కారణం’ అని తెలిపారు. మెక్సికోలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు అక్కడ 25,58,369 మంది కరోనా బారిన పడగా.. 2,34,193 మంది మరణించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని