close

తాజా వార్తలు

Published : 21/04/2021 08:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా వార్డు నుంచి బైక్‌పై వ్యక్తి జంప్‌!


భార్యతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న దృశ్యం

సైదాపేట, న్యూస్‌టుడే: కరోనా లక్షణాలున్న ఓ వ్యక్తి ఆస్పత్రి నుంచి బయటకు పారిపోయిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పుదుకోట్టై జిల్లా అరందాంగి పరిసర ప్రాంతాల్లో కరోనా సోకినవారు అరందాంగి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో 32 ఏళ్ల వ్యక్తికి కొవిడ్‌ లక్షణాలు ఉండటంతో సోమవారం పరీక్షలు చేసి కరోనా ప్రత్యేక వార్డులో ఉంచారు.

పరీక్షల ఫలితం రాకుండానే తనను ఎందుకు వార్డులో ఉంచారంటూ ఆ వ్యక్తి ఆస్పత్రి సిబ్బందితో గొడవకు దిగాడు. అక్కడున్న తలుపు అద్దం పగులకొట్టి, ఎదురుగా వచ్చిన వారిపై ఉమ్మి వేశాడు. రాత్రి విధుల్లో ఉన్న వైద్యుడు అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించడంతో వైద్యునిపై దాడి చేసేందుకు యత్నించినట్లు సమాచారం. చివరకు భార్యను ఆస్పత్రికి రప్పించి ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించేందుకు ఆస్పత్రి ప్రధాన వైద్యుడు శేఖర్‌ అతని కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. ఆస్పత్రిలో చికిత్స పొందకపోయినా హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని