బెంగాల్‌ను ఆదుకుంటాం..

తాజా వార్తలు

Published : 04/08/2021 23:26 IST

బెంగాల్‌ను ఆదుకుంటాం..

దీదీతో ఫోన్‌ సంభాషణలో ప్రధాని

దిల్లీ : వరదలతో నష్టపోయిన రాష్ట్రాన్నిఆదుకుంటామని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు ఆనకట్టల నుంచి విడుదల చేసిన నీటి కారణంగా నదులు పోటెత్తడంతో వరదలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీదీ చేపట్టాల్సిన వరద ప్రభావిత ప్రాంతాల ఏరియల్‌సర్వే వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దయింది. అనంతరం ఆమె ప్రధానికి ఫోన్ చేసి మాట్లాడారు. ‘పశ్చిమ బెంగాల్‌లో సంభవిస్తున్న వరదల పరిస్థితిని తెలుసుకోవడానికి సీఎం మమతా బెనర్జీతో ప్రధానమంత్రి ఫోన్‌లో సంభాషించారు. వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల శ్రేయస్సు కోసం ఆయన ప్రార్థిస్తున్నారు’ అని పీఎంఓ కార్యాలయం ట్వీట్ చేసింది.
రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదలకు కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. తూర్పు బర్ధమాన్‌, పశ్చిమ బర్ధమాన్, పశ్చిమ మేదినీపూర్, హుగ్లీ, హౌడా, దక్షిణ 24 పరగణాలతో సహా అనేక జిల్లాలు వరదలకు ప్రభావితమయ్యాయి. ఆరు ప్రభావిత జిల్లాల్లోని అనేక ప్రాంతాలు వరదలో చిక్కుకుపోయాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని