Khela Hobe: ‘ఖేలా హోబే’ ప్రారంభం.. ఫుట్‌బాల్‌ ఆడిన దీదీ

తాజా వార్తలు

Published : 02/08/2021 22:44 IST

Khela Hobe: ‘ఖేలా హోబే’ ప్రారంభం.. ఫుట్‌బాల్‌ ఆడిన దీదీ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరదాగా కాసేపు ఫుట్‌బాల్‌తో సందడి చేశారు. ఫుట్‌బాల్ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో బెంగాల్ ప్రభుత్వం ‘ఖేలా హోబే’ కార్యక్రమాన్ని చేపట్టింది. ‘ఆట ఆడదామా’ అనే అర్థం వచ్చే ఈ నినాదంతోనే బంగాల్ ఎన్నికల్లో దీదీ విజయం సాధించారు. అదే పేరుతో.. పశ్చిమ బంగాల్‌లోని ఫుట్‌బాల్ క్లబ్‌లకు లక్ష ఫుట్‌బాళ్లు అందించే కార్యక్రమాన్ని ఆమె సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆగస్టు 16వ తేదీని ఖేలా హోబే రోజుగా ప్రకటించారు.

కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మమతా బెనర్జీ క్రీడాకారులకు ఫుట్‌బాళ్లు అందించారు. 25 వేల క్లబ్బులకు ఒక్కో దానికి రూ.5 లక్షలను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వేదికపైనే ఆమె కాసేపు ఫుట్‌బాల్‌తో ఆడారు. ఖేలా హోబే నినాదం ఎంతో ఖ్యాతి గడించిందని పేర్కొన్నారు. పార్లమెంట్‌లోనూ ఈ నినాదాన్ని లేవనెత్తినట్లు తెలిపారు. త్వరలో ఖేలా హోబే నినాదం దేశమంతా ప్రతిధ్వనిస్తుందని దీదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఖేలా హోబే నినాదం ఎంతో పాపులర్‌ అయ్యింది. ఈ నినాదంతోనే దీదీతోపాటు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీఎంసీ భారీ విజయం సాధించింది. 294 అసెంబ్లీ సీట్లకు గానూ 213 స్థానాల్లో గెలుపొందింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని