అమెరికాలో గాంధీ విగ్రహం అపవిత్రం

తాజా వార్తలు

Updated : 31/01/2021 09:38 IST

అమెరికాలో గాంధీ విగ్రహం అపవిత్రం

శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దావిద్‌ సిటీలోని సెంట్రల్‌ పార్కులో ఉన్న భారత జాతిపిత విగ్రహాన్ని ధ్వంసంచేయడంపై భారతీయ అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ జాత్యహంకార దుశ్చర్యపై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన భారత విదేశాంగ శాఖ ఈ చర్యను ఖండిస్తున్నట్లు పేర్కొంది. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసినవారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరింది. ఈ ఘటనపై అధికారులు ప్రత్యేకంగా దర్యాప్తు జరుపుతున్నారని భారత కాన్సులెట్‌ జనరల్‌ తెలిపారు. ఈ ఘటన జనవరి 28న జరిగినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి...

బెడిసికొడుతున్న చైనా వ్యూహం!
దిల్లీ పేలుడు.. ఆ ఉగ్రవాదుల పనేనా?

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని