మహారాష్ట్రలో భారీగా తగ్గిన కొవిడ్‌ కేసులు! 

తాజా వార్తలు

Published : 26/04/2021 22:56 IST

మహారాష్ట్రలో భారీగా తగ్గిన కొవిడ్‌ కేసులు! 

ముంబయి: మహారాష్ట్రలో కరోనా విజృంభణ సోమవారం తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ 60వేలకు పైగా కేసులతో తుపానులా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అయితే,  సోమవారం 48,700 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. గడచిన 24గంటల వ్యవధిలో 71736 మంది కోలుకోగా.. 524మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. మహారాష్ట్రలో ఇప్పటిదాకా 2,59,72,018 టెస్ట్‌లు చేయగా 43,43,727మందిలో వైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయింది. వీరిలో 36,01,796మంది కోలుకోగా.. 65,284మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 6,74,770 క్రియాశీల కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో మరణాల రేటు 1.5శాతం ఉండగా.. రికవరీ రేటు 82.92%గా ఉంది. మరోవైపు, ముంబయి మహా నగరంలో సోమవారం 3876 కొత్త కేసులు 70 మరణాలు నమోదు కాగా.. 9150మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,31,527కి చేరింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని