vaccination Drive: మరో మైలురాయి.. 100 కోట్ల టీకా డోసులకు చేరువలో భారత్‌!

తాజా వార్తలు

Published : 14/10/2021 02:15 IST

vaccination Drive: మరో మైలురాయి.. 100 కోట్ల టీకా డోసులకు చేరువలో భారత్‌!

దిల్లీ: కరోనా వైరస్‌ను నివారించే కొవిడ్‌ వ్యాక్సినేషన్ ప్రక్రియ భారత్‌లో శరవేగంగా కొనసాగుతోంది. ప్రతి నెలా కొత్త రికార్డులు నెలకొల్పుతూ ముందుకు సాగుతోంది. కొద్దిరోజుల్లో మరో మైలురాయిని అందుకునేందుకు భారత్‌ సిద్ధమైంది. వచ్చే వారంలో వంద కోట్ల డోసుల్ని పూర్తిచేసుకొని వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో చారిత్రక మైలురాయి చేరనుంది. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో ఈ ఫీట్‌ను అందుకోనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. 

టీకా పంపిణీ వేగాన్ని పెంచేలా అక్టోబర్‌ నెలలో 28 కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులు ఉత్పత్తి చేయనున్నట్టు మాండవీయ తెలిపారు. దిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో టీకా వేసుకొనేందుకు అర్హులైన వారిలో 73 శాతం మందికి తొలి డోసు పూర్తయిందని, దాదాపు 29 శాతం మంది రెండు డోసులూ తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 8 కోట్లకు పైగా డోసులు ఉన్నాయన్నారు. ఈ నెలలో ఉత్పత్తికానున్న 28 కోట్ల డోసుల్లో దాదాపు 22 కోట్ల డోసులు కొవిషీల్డ్‌ కాగా.. మిగతా 6 కోట్ల డోసులు కొవాగ్జిన్‌కి చెందినవని చెప్పారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా సుమారు 97 కోట్ల డోసుల పంపిణీ పూర్తయిందన్నారు. వచ్చే వారంలోనే 100 కోట్ల డోసుల పంపిణీ మైలురాయిని అధిగమిస్తామన్నారు. అక్టోబర్‌ 19 లేదా 20 తేదీల్లో ఈ మైలురాయి చేరే అవకాశం ఉన్నట్టు చెప్పారు. 

కొవిన్‌ డ్యాష్‌బోర్డు వివరాల ప్రకారం.. బుధవారం 30.25 లక్షల మందికి కొవిడ్‌ టీకాలు అందించారు. దీంతో ఈరోజు సాయంత్రం నాటికి దేశంలో 96.7 కోట్ల డోసులు పూర్తయ్యాయి. టీకాల ఎగుమతికి ప్రస్తుతం ప్రాధాన్యం ఇవ్వడంలేదని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. దేశంలోని ప్రజలకు ఇవ్వగా అదనంగా ఏమైనా మిగిలి ఉంటే ఎగుమతులపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. భారత్‌తో బూస్టర్‌ డోసుల వినియోగంపై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. రోగనిరోధక శక్తి లేని వ్యక్తులకు మాత్రమే బూస్టర్ డోసు అందిచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విషయాన్ని సదరు అధికారి గుర్తుచేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని