​​​​​​రైతులకు ₹10వేలు.. క్యాబ్‌ డ్రైవర్లకు ₹3వేలు

తాజా వార్తలు

Published : 19/05/2021 16:33 IST

​​​​​​రైతులకు ₹10వేలు.. క్యాబ్‌ డ్రైవర్లకు ₹3వేలు

జీవనోపాధి కోల్పోయిన వారికి కర్ణాటక ప్యాకేజీ

బెంగళూరు: లాక్‌డౌన్‌ కారణంగా జీవనోపాధి కోల్పోయిన వారి కోసం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.1250 కోట్లతో రిలీఫ్‌ ప్యాకేజీ ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప విలేకరుల సమావేశంలో ప్యాకేజీ వివరాలు బుధవారం ప్రకటించారు. ఈ నెల 24తో లాక్‌డౌన్‌ గడువు ముగియనుండడంతో పొడిగింపుపై రెండు రోజుల్లో నిర్ణయాన్ని వెలువరిస్తామని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నప్పటికీ, కష్ట సమయంలో ప్రజలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

పూలు, పండ్లు, కూరగాయలు సాగు చేసే రైతులకు హెక్టార్‌కు గరిష్ఠంగా ₹10వేల చొప్పున సాయం అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. ఆటో, ట్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లకు, భవన నిర్మాణ కార్మికులకు ₹3వేలు చొప్పున అందించనున్నారు. క్షురకులు, రజకులు, దర్జీ పని వాళ్లు, స్వర్ణకారులు, మెకానిక్‌లు తదితర అసంఘటిత రంగ కార్మికులు, వీధి వ్యాపారులకు ₹2వేలు చొప్పున సాయం ప్రకటించారు. కొవిడ్‌ తొలిసారి విజృంభించిన సమయంలోనూ ఈ తరహాలోనే కర్ణాటక ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని