లాక్‌డౌన్‌ లేదు.. ఆంక్షలు మాత్రం ఉంటాయ్‌!

తాజా వార్తలు

Published : 30/03/2021 01:12 IST

లాక్‌డౌన్‌ లేదు.. ఆంక్షలు మాత్రం ఉంటాయ్‌!

బెంగళూరు: ఓ వైపు కరోనా వైరస్‌ ఉద్ధృతి పెరుగుతున్నప్పటికీ.. రాష్ట్రంలో ప్రస్తుతానికి లాక్‌డౌన్‌ విధించే యోచన లేదని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అపార్ట్‌మెంట్లలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఎలాంటి వేడుకలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. అవసరమైతేనే బయటకు రావాలని వీలైనంత వరకు సామాజికి దూరం పాటించాలని సూచించింది. మరో 15 రోజుల పాటు రాష్ట్రంలో ఎలాంటి ర్యాలీలను అనుమతించబోమని చెప్పింది.

ఇటీవల బెంగళూరులోని రాజ్‌లేఖ్‌ అపార్ట్‌మెంట్లో దాదాపు 100కు పైగా కేసులు నమోదవ్వడాన్ని ప్రభుత్వం ఈ సందర్భంగా ఉటంకించింది. కర్ణాటకలో ఇప్పటి వరకు 9,87,012 కరోనా కేసులు నమోదవ్వగా.. 12,504 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో 2,000 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 9,52,00 మంది కరోనా నుంచి కోలుకోగా.. 23,037 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 84.5 శాతం కేసులు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పంజాబ్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌లోనే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని