‘పెగాసస్‌’పై ఇజ్రాయెల్‌ దర్యాప్తు

తాజా వార్తలు

Published : 21/07/2021 21:10 IST

‘పెగాసస్‌’పై ఇజ్రాయెల్‌ దర్యాప్తు

దిల్లీ: పెగాసెస్‌ స్పైవేర్‌ వ్యవహారం భారత్‌ సహా పలు దేశాలను కుదిపేస్తున్న వేళ ఇజ్రాయెల్‌ ప్రభుత్వం స్పందించింది. ఆ దేశానికి చెందిన ఎన్‌ఎస్‌వో సంస్థ ఈ  స్పైవేర్‌ విక్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇజ్రాయెల్‌ మంత్రుల బృందం ఒకటి దర్యాప్తు జరపనుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది.

ఈ బృందానికి నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ నేతృత్వం వహించనుంది. ఎన్‌ఎస్‌వో ఎగుమతులపై ఈ బృందం సమీక్షించనుందని, నేరుగా ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌కు నేరుగా ఈ బృందం నివేదిస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్‌ ప్రభుత్వం దర్యాప్తును తాము స్వాగతిస్తున్నామని ఎన్‌ఎస్‌వో అధికార ప్రతినిధి తెలిపారు. తమ సంస్థ కార్యకలాపాల్లో ఎటువంటి లోపాలూ లేవని పునరుద్ఘాటించారు. ప్రధాని కార్యాలయం మాత్రం దీనిపై స్పందించలేదు.

భారత్‌ సహా 50 దేశాలకు చెందిన వ్యక్తుల పేర్లు పెగాసస్‌ స్పైవేర్‌కు చెందిన లక్షిత జాబితాలో ఉన్నట్లు తేలింది. ఇందులో జర్నలిస్టులు, రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు, మానవ హక్కుల కార్యకర్తలు ఉన్నారు. ప్రస్తుతం భారత్‌లో దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. అధికార పార్టీపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తుండగా.. దీంతో తమకేమాత్రం సంబంధం లేదని ప్రభుత్వం చెబుతోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని