పగ తీర్చుకుంటాం: ఇరాన్‌ వార్నింగ్‌

తాజా వార్తలు

Published : 22/01/2021 23:13 IST

పగ తీర్చుకుంటాం: ఇరాన్‌ వార్నింగ్‌

ట్రంప్‌ ఫొటోమాంటేజ్‌తో ట్వీట్‌ చేసిన ఇరాన్‌ కీలక నేత

టెహ్రాన్‌: 2020లో ఇరాన్‌ అగ్రశ్రేణి సైనికాధికారి జనరల్‌ సులేమానీపై డ్రోన్‌దాడి చేసి హతమార్చిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ కీలక నేత అయతొల్లా అలీ ఖమేనీ అన్నారు. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి ఆయన ట్విటర్‌ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ట్రంప్‌ ఫొటోమాంటేజ్‌ (సృష్టించిన చిత్రం) పెట్టి దానిపై 2020 డ్రోన్‌ దాడికి ప్రతీకారం తీర్చుకుంటాం అని రాసి ఉన్న చిత్రాన్నిఉంచారు. ఆ ఫొటో మాంటేజ్‌లో ట్రంప్‌ గోల్ఫ్‌ ఆడుతుండగా, పై నుంచి యుద్ధవిమానాలు వెళ్తున్నట్లుగా ఉంది. ‘ జనరల్‌ సులేమానీని హత్య చేసినవారు, దానికి ఆదేశాలిచ్చినవారిపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం.’ అని ఆయన ఆ పోస్టులో  పేర్కొన్నారు.

గతేడాది జనవరి 3న ఇరాక్‌లోని బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి జరిగింది. ఆ దాడిలో ఇరాన్‌ సైనిక ఉన్నతాధికారి ఖాసీం సోలెమన్‌ మరణించారు. అనంతరం ఆ దాడిని తామే చేసినట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ వెల్లడించింది. అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాల మేరకే ఆ దాడి జరిపినట్లు వారు ప్రకటించారు. కాగా అమెరికా చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ గట్టి హెచ్చరికలే చేసింది. బుధవారం అమెరికా అధ్యక్షుడిగా తన బాధ్యతలకు వీడ్కోలు పలికి ట్రంప్‌ వైట్‌ హౌస్‌ను వీడారు. ఈ సమయంలో డ్రోన్‌ దాడి అంశంపై ఇరాన్‌ కీలక నేత ట్వీట్‌ పెట్టడం గమనార్హం.

ఇవీ చదవండి..

సమర్ధవంతంగా కొవాగ్జిన్‌: లాన్సెట్‌ పరిశీలన

ట్రంప్‌తో సంభాషణా? ఇప్పట్లో లేదు..Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని