JK: ఉరీలో ఇంటర్నెట్‌, ఫోన్‌ సర్వీసులు నిలిపివేత

తాజా వార్తలు

Published : 20/09/2021 23:17 IST

JK: ఉరీలో ఇంటర్నెట్‌, ఫోన్‌ సర్వీసులు నిలిపివేత

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉరీ సెక్టార్‌లో ఇంటర్నెట్‌, ఫోన్‌ సర్వీసులను అధికారులు నిలిపివేశారు. భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ఉరీ సెక్టార్‌లోని నియంత్రణా రేఖ సమీపంలో చొరబాటుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు గత 30 గంటలుగా ఆ ప్రాంతంలో చొరబాటు ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు. మరిన్ని బలగాలను రంగంలోకి దించిన సైన్యం.. ఆ ప్రాంతంలో భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినట్టు సమాచారం. ఈ సంవత్సరంలో ఇది రెండో చొరబాటు ప్రయత్నమని ఆర్మీ వర్గాలు పేర్కొంటున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని