భారత్‌కు చేరిన క్రయోజనిక్‌ కంటైనర్లు

తాజా వార్తలు

Published : 24/04/2021 23:24 IST

భారత్‌కు చేరిన క్రయోజనిక్‌ కంటైనర్లు

పనగఢ్‌:  సింగపూర్‌ నుంచి 4 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ కంటైనర్లు భారత్‌కు చేరాయి. ఇవాళ ఉదయం సింగపూర్‌ నుంచి బయల్దేరిన ఐఏఎఫ్‌ సి-17 విమానం పశ్చిమబెంగాల్‌లోని పనగఢ్‌ ఎయిర్‌బేస్‌కు చేరుకుంది. కరోనా విజృంభణతో దేశంలో మెడికల్‌ ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దేశీయ ప్లాంట్లు ఆక్సిజన్‌ ఉత్పత్తిని పెంచినప్పటికీ అవసరాలకు సరిపడా ప్రాణవాయువు లభించడం లేదు. దేశంలో పరిస్థితి క్లిష్టంగా మారుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం సింగపూర్‌తో ఆక్సిజన్‌ దిగుమతి కోసం సంప్రదింపులు జరిపింది. చర్చలు ఫలించిన తర్వాత భారత్‌ నుంచి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఖాళీ యుద్ధ విమానాలు ఆ దేశానికి వెళ్లాయి. తిరిగి ఆక్సిజన్‌ కంటైనర్లను లోడ్‌ చేసుకొని చాంగి విమానాశ్రయం నుంచి స్వదేశానికి వస్తున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని