Covid vaccine: ప్రతి నెల 30 కోట్ల డోసుల ఉత్పత్తి!

తాజా వార్తలు

Published : 16/10/2021 23:15 IST

Covid vaccine: ప్రతి నెల 30 కోట్ల డోసుల ఉత్పత్తి!

దిల్లీ: కొవిడ్‌ టీకా ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచానికే దిక్సూచిలో మారింది. దేశీయంగా ఇప్పటికే పలు సంస్థలు టీకాలను తయారు చేస్తుండగా.. మరికొన్ని సంస్థలు సైతం వ్యాక్సిన్‌ ఉత్పత్తికి ముందడుగు వేస్తున్నాయి. ఈ నెలాఖరులోగా మొత్తంగా 28 కోట్ల టీకాలను ఆయా సంస్థలు ఉత్పత్తి చేయనున్నట్లు ప్రభుత్వం కొద్దిరోజుల క్రితమే వెల్లడించింది. వీటిలో సీరం సంస్థకు చెందిన కొవిషీల్డ్‌ టీకాలు 22 కోట్లు, భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ 6 కోట్లు, జైడస్‌ క్యాడిలాకు చెందిన జైకోవిడ్‌ వ్యాక్సిన్లు 60 లక్షలు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. కాగా వచ్చే ఏడాది నుంచి ఈ సంఖ్య పెరగనున్నట్లు తెలుస్తోంది. బయోలాజికల్‌-ఇ తయారు చేస్తోన్న కార్బెవ్యాక్స్‌ టీకా కూడా అందుబాటులోకి రానున్న నేపథ్యంలో జనవరి నుంచి దేశంలో ప్రతి నెలా 30 కోట్ల టీకా డోసులు ఉత్పత్తి కానున్నట్లు సమాచారం.

ప్రతి నెలా 60 లక్షల డోసులు ఉత్పత్తి చేస్తామని జైడస్‌ క్యాడిలా గతంలోనే ప్రకటించింది. సూది అవసరం లేకుండా దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ టీకాల వినియోగానికి ఆగస్టులోనే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా 60 లక్షల డోసులు పంపిణీకి ఈ సంస్థ సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం స్టాక్‌పైల్‌ డోసులను కూడా జైడస్‌ క్యాడిలా ప్రారంభించింది. ఈ నెలలో లేదా నవంబర్‌లో ఈ టీకా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. జెన్నోవా బయోఫార్మా కంపెనీ ‘HGC019’ రూపొందిస్తున్న ఎంఆర్‌ఎన్‌ఏ (mRNA) వ్యాక్సిన్‌ సైతం అందుబాటులోకి రానుంది. ఈ టీకాలన్నీ కలిపి వచ్చే ఏడాది జనవరి నుంచి దేశంలో ప్రతి నెలా 30 కోట్ల టీకా డోసులు ఉత్పత్తి చేయనున్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.

ఇదిలా ఉండగా దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. రానున్న సోమ లేదా మంగళవారం నాటికి దేశంలో 100 కోట్ల డోసులు పూర్తి కానున్నాయి. అక్టోబరు 18 లేదా 19 నాటికి వంద కోట్ల డోసుల పంపిణీ ఫీట్‌ను చేరుకుంటామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ గురువారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 100 కోట్ల డోసులు పూర్తయినప్పుడు దేశవ్యాప్తంగా రైల్వే, మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలు, బస్టాండులు, ఓడరేవుల్లో ఈ మేరకు అనౌన్స్‌మెంట్‌ చేస్తామని పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకు దేశంలో 97,57,76,383 టీకా డోసులు పూర్తయ్యాయి. వీటిలో 69,52,86,224 మంది మొదటి డోసు తీసుకున్నవారు ఉండగా.. 28,04,90,159 మంది రెండు డోసులు తీసుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని