కొవిషీల్డ్‌ భారీ ఎగుమతులు నిలిపివేత!

తాజా వార్తలు

Published : 25/03/2021 19:51 IST

కొవిషీల్డ్‌ భారీ ఎగుమతులు నిలిపివేత!

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ అవసరాల రీత్యా కొద్ది రోజులపాటు కొవిషీల్డ్‌ టీకాలను పెద్ద ఎత్తున ఎగుమతి చేయడాన్ని నిలిపివేయాలని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది. కొవిషీల్డ్‌ టీకాలను సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న వేళ వ్యాక్సినేషన్‌ పక్రియను వేగవంతం చేసే పనిలో కేంద్రం నిమగ్నమైంది. ఈ ప్రక్రియలో భాగంగా దేశీయ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ కొవిషీల్డ్ టీకాల భారీ ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్రం భావిస్తోందని సమాచారం. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారుగా భారత్‌ ఉన్న నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని