Corona: 30 కోట్ల మైలురాయి దాటిన టీకాలు..!
close

తాజా వార్తలు

Updated : 24/06/2021 11:31 IST

Corona: 30 కోట్ల మైలురాయి దాటిన టీకాలు..!

కొత్తగా 54,069 కేసులు..1,321 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తోంది. తాజాగా 18,59,469 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..54,069 మందికి పాజిటివ్‌గా తేలింది. వరుసగా రెండోరోజు కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. తాజాగా 1,321 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3,00,82,778కి చేరగా.. 3,91,981 మరణాలు సంభవించాయని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

ప్రస్తుతం క్రియాశీల కేసులు 6.27 లక్షలకు తగ్గగా.. ఆ రేటు 2 శాతానికి సమీపంలో ఉంది. నిన్న 68,885 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తంగా 2,90,63,740 మంది వైరస్‌ నుంచి బయటపడగా.. రికవరీ రేటు 96.56 శాతానికి పెరిగింది. 

టీకా డోసుల పంపిణీ వేగవంతం..
దేశవ్యాప్తంగా జనవరి 16న ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమంలో ఇటీవల కాస్త వేగం కనిపిస్తోంది. జూన్ 23 నాటికి 30.16కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగింది. నిన్న ఒక్కరోజే 64,89,599 మంది టీకాలు వేయించుకున్నారు. 

 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని