India Corona : 16వేలకు దిగువన కొత్త కేసులు

తాజా వార్తలు

Updated : 24/10/2021 11:12 IST

India Corona : 16వేలకు దిగువన కొత్త కేసులు

దిల్లీ : భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అంతక్రితం రోజుతో పోల్చితే తాజా కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల నమోదైంది. తాజాగా 16 వేలకు దిగువన కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

* గడిచిన 24 గంటల్లో 13,40,158 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 15,906 కేసులు వెలుగులోకి వచ్చాయి.

* ఇక పలు రాష్ట్రాలు మరణాల సంఖ్యను సవరిస్తుండటంతో ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. నిన్న 561 మంది కొవిడ్‌తో మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 454269కి చేరింది.

* గత కొన్ని రోజులుగా కొత్తగా నమోదవుతున్న కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. నిన్న 16,479 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కొవిడ్‌ను జయించిన వారి సంఖ్య 3.35 కోట్లకు చేరి ఆ రేటు 98.17 శాతానికి పెరిగింది. గత ఏడాది మార్చి నుంచి ఇదే అత్యధికం.

* క్రియాశీల కేసుల కొండ కూడా క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,72,594 చేరి ఆ రేటు 0.51 శాతానికి దిగివచ్చింది.

ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 77,40,676 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటి వరకూ అందించిన టీకా డోసుల సంఖ్య 1.02 కోట్లకు చేరింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని