నాకొచ్చే దాంట్లో సగానికిపైగా పన్నులకే: రాష్ట్రపతి

తాజా వార్తలు

Published : 28/06/2021 20:52 IST

నాకొచ్చే దాంట్లో సగానికిపైగా పన్నులకే: రాష్ట్రపతి

దిల్లీ: ప్రజలంతా పన్నులు సక్రమంగా చెల్లించి దేశాభివృద్ధికి పాటుపడాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కోరారు. తాను సైతం పన్నులు చెల్లిస్తున్నానని వెల్లడించారు. తనకొచ్చే ₹5లక్షల వేతనంలో సగానికిపైగా పన్నుల రూపంలో చెల్లిస్తున్నట్లు వివరించారు. తనకంటే కొందరు ఉద్యోగులే ఎక్కువ పొదుపు చేయగలుగుతున్నారని చెప్పారు. తన మూడు రోజుల యూపీ పర్యటనలో భాగంగా కాన్పూర్‌ జిల్లాలోని జింజక్‌ టౌన్‌లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

‘‘కొన్నిసార్లు ఆగ్రహంతో కొందరు రైళ్లను తగలబెడుతుంటారు. అది ప్రభుత్వ సొమ్మే అనుకుంటారు. కానీ, అది ప్రజల సొమ్ము అని వారికి తెలీదు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం అంటే ప్రజల సొమ్మును తగలబెడుతున్నట్లే. అలాగే చాలా మంది రాష్ట్రపతికి ఎక్కువ జీతం వస్తుందని అనుకుంటారు. కానీ నాకొచ్చే ₹5 లక్షల్లో ప్రతి నెలా ₹2.75 లక్షలను పన్నుగా చెల్లిస్తున్నా’’ అని రాష్ట్రపతి చెప్పారు. తన కంటే కొందరు ఉద్యోగులే ఎక్కువ సంపాదిస్తుంటారని చెప్పారు. అభివృద్ధి జరగాలంటే ప్రజలంతా పన్నులు సక్రమంగా చెల్లించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని