Wildfire: ఆగని కార్చిచ్చు.. కళ్ల ముందే ఆహుతవుతున్న కలల సౌధాలు!

తాజా వార్తలు

Published : 08/08/2021 12:41 IST

Wildfire: ఆగని కార్చిచ్చు.. కళ్ల ముందే ఆహుతవుతున్న కలల సౌధాలు!

ఏథెన్స్‌: పలు దేశాల్లో బెంబేలెత్తిస్తున్న కార్చిచ్చు.. వేలాది కుటుంబాలను రోడ్లపైకి తీసుకొచ్చింది. కట్టుకున్న కలల సౌధాలు కళ్ల ముందే మంటల్లో ఆహుతవుతుంటే గ్రీస్‌ ప్రజలు నిస్సహాయ స్థితిలో చూస్తూ రోదిస్తున్నారు. చేసేది లేక ప్రభుత్వం కల్పించిన పునరావాస కేంద్రాల్లో కాలం వెళ్లదీస్తున్నారు. గత కొన్ని రోజులుగా గ్రీస్‌లో చెలరేగుతున్న మంటలు శనివారం మరింత ఉగ్రరూపం దాల్చాయి. దాదాపు 1450 మంది అగ్నిమాపక సిబ్బంది.. విమానాలతో మంటల్ని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌కు ఉత్తర దిశగా ఉన్న ప్రెస్‌కొఫిటో అనే ప్రాంతానికి చెందిన ఓ పెన్షనర్‌ మాట్లాడుతూ.. ‘‘బహుశా మా ఇళ్లు ఉన్న ప్రాంతానికి మా మునిమనవళ్లే వెళ్లగలరు’’ అంటూ బోరున విలపించారు. దీన్ని బట్టి అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రీస్‌కు అండగా నిలిచేందుకు ఫ్రాన్స్‌, బ్రిటన్‌, ఈజిప్టు, స్పెయిన్‌ ముందుకు వచ్చాయి. మరోవైపు టర్కీలో వర్షాలు కురుస్తుండడంతో కార్చిచ్చు కాస్త అదుపులోకి వచ్చింది.

గ్రీస్‌లో గత 10 రోజుల్లో 56,655 హెక్టార్ల విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయి. అధిక ఉష్ణోగ్రతలు, భారీ గాలుల నేపథ్యంలో మంటలు మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మంటల కారణంగా గ్రీస్‌లో ఇద్దరు చనిపోగా.. టర్కీలో 8 మంది మరణించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని