యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయి?

తాజా వార్తలు

Updated : 25/03/2021 12:50 IST

యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయి?

సింగపూర్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

సింగపూర్‌: కొవిడ్‌ ఒకసారి వస్తే... మళ్లీ రాదా? బాధితుల్లో కరోనా ప్రతినిరోధకాలు (యాంటీబాడీలు) ఎంతకాలం ఉంటాయి? యాంటీబాడీలు లేకపోయినా, రోగనిరోధక వ్యవస్థ వారికి రక్షణ కల్పిస్తుందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కనుగొన్నారు... సింగపూర్‌ శాస్త్రవేత్తలు! కరోనా ప్రతినిరోధకాలు కొందరిలో రోజుల వ్యవధిలోనే కనుమరుగైతే... మరికొందరిలో ఏళ్ల తరబడి ఉనికిని చాటుకుంటాయని లెక్కగట్టారు. బాధితుల రోగనిరోధక శక్తి, కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ తీవ్రతను బట్టే ఈ వ్యత్యాసం ఉంటున్నట్టు వారు విశ్లేషించారు. సింగపూర్‌లోని డ్యూక్‌-ఎన్‌యూఎస్‌ మెడికల్‌ స్కూల్‌ శాస్త్రవేత్తలు 164 మంది కొవిడ్‌ బాధితులను 9 నెలలపాటూ పరీక్షించారు. వారిలోని యాంటీబాడీలు, టి-కణాలు, రోగనిరోధక వ్యవస్థ సంకేతాల తీరును తెలుసుకున్నారు. ఈ వివరాలను గణిత నమూనా ద్వారా విశ్లేషించి, బాధితులను ఐదు గ్రూపులుగా విభజించారు.

వారు: 
1) కరోనా యాంటీబాడీలు ఏమాత్రం అభివృద్ధికాని ‘నెగెటివ్‌ గ్రూపు’ వారు (11.6%)
2) ప్రతినిరోధకాలు అభివృద్ధి చెందినా, త్వరగా వాటిని కోల్పోయే ‘ర్యాపిడ్‌ వేనింగ్‌’ వారు (26.8%)
3) కనీసం 6 నెలలపాటు యాంటీబాడీలు ఉండేవారు (29%)
4) 180 రోజుల వ్యవధిలో ప్రతినిరోధకాల స్థాయి స్వల్పంగా మార్పు చెందేవారు (31.7)
5) ఇన్‌ఫెక్షన్‌ నుంచి స్వస్థత, ప్రతిస్పందన ఆలస్యమయ్యేవారు (1.8%). 

‘‘బాధితుల్లో యాంటీబాడీలు అంతంత మాత్రంగానే ఉన్నా, రోగనిరోధక వ్యవస్థలోని టి-కణాలు శక్తిమంతంగా ఉంటే వారు మళ్లీ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడకుండా అవి కాపాడతాయి. వ్యాక్సిన్ల ద్వారా యాంటీబాడీలు ఉత్పత్తి అయినా, కొందరిలో అవి ఎక్కువకాలం ఉండకపోవచ్చు. ఇలాంటి వారు ఏటా వ్యాక్సిన్‌ వేయించుకోవడం మంచిది’’ అని పరిశోధనకర్త వాంగ్‌ లిన్ఫా చెప్పారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని