సహనాన్ని పరీక్షించొద్దు.. రైతులకు సీఎం వార్నింగ్‌

తాజా వార్తలు

Published : 01/07/2021 01:20 IST

సహనాన్ని పరీక్షించొద్దు.. రైతులకు సీఎం వార్నింగ్‌

చండీగఢ్‌: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం సహిస్తోంది కదా అని.. హద్దులు మీరొద్దని హెచ్చరించారు. దానికీ ఓ రోజు వస్తుందంటూ వ్యాఖ్యానించారు. యూపీ- దిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమకారులకు, భాజపా కార్యకర్తలకు మధ్య బుధవారం జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘రైతు’ అనే పదం ఎంతో స్వచ్ఛమైనది. దానికి ఉన్నత స్థానం ఉంది. దురదృష్టవశాత్తూ కొన్ని ఘటనల వల్ల ఆ పదం అపఖ్యాతి పాలౌతోంది’’ అని ఖట్టర్‌ అన్నారు. రైతు ఉద్యమం పేరుతో సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని, రోడ్లను దిగ్బంధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

‘‘మేం సహనంతో ఉంటున్నాం కదా అని కొందరు హద్దులు మీరుతున్నారు. ప్రతిదానికీ ఓ హద్దు ఉంటుంది. ఓ రోజంటూ వస్తే సహనం నశిస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయి’’ అని ఖట్టర్‌ హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు ఊళ్లలో పర్యటించకుండా అడ్డుకోవడం వంటి చర్యలను ఆయన ఖండించారు. పంజాబ్‌, హరియాణాతో పాటు ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన రైతులు గత ఏడెనిమిది నెలలుగా వ్యవసాయ చట్టాలపై ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని