సౌదీ బాటలో కువైట్‌: విమానాల నిలిపివేత

తాజా వార్తలు

Published : 04/02/2021 14:51 IST

సౌదీ బాటలో కువైట్‌: విమానాల నిలిపివేత

దుబాయి: గల్ఫ్‌ ప్రాంతానికి చెందిన పలు దేశాల జనాభాలో విదేశీ కార్మికులు, ఉద్యోగులు అధికంగా ఉంటారనే సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ కేసులు అధికమౌతున్న నేపథ్యంలో మరిన్ని గల్ఫ్‌ దేశాలు సౌదీ అరేబియాను అనుసరిస్తున్నాయి. మిగిలిన ప్రపంచ దేశాలలో పోలిస్తే కరోనా మరణాల సంఖ్య తక్కువే ఐనా.. కేసుల సంఖ్య ఇటీవల పెరుగుతూండటం ఈ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో పలు ఎడారి దేశాలు అంతర్జాతీయ రాకపోకలు, తదితర అంశాలపై ఆంక్షలు విధిస్తున్నాయి.

తాజాగా విదేశీయుల రాకను రెండు వారాల పాటు పూర్తిగా నిషేధిస్తూ కువైట్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల ఏడవ తేదీ, ఆదివారం నుంచి ఈ నిషేధాజ్ఞలు అమల్లోకి వస్తాయి. స్థానిక హెల్త్‌ క్లబ్‌లు, జిమ్‌ తదితరాలు మూసివేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఫిబ్రవరి 25 నాటి జాతీయ దినోత్సవ వేడుకలను కూడా కువైట్‌ ప్రభుత్వం రద్దుచేసింది. ఇక సౌదీ అదేబియా, భారత్‌తో సహా ఇరవై దేశాల నుంచి విమానాల రాకపోకలను ఇప్పటికే నిషేధించింది. అంతేకాకుండా తమ దేశంలో వివాహాలు, విందులను కూడా పదిరోజుల పాటు రద్దు చేసింది. షాపింగ్‌ మాల్స్‌, వ్యాయామశాలలు తదితర బహిరంగ ప్రదేశాలను మూసివేసింది.

మరో గల్ఫ్‌ దేశమైన ఒమన్‌, జనవరి నెల మధ్య నుంచే భౌగోళిక సరిహద్దులను మూసివేసింది. అయితే ఇక్కడ అంతర్జాతీయ విమానాల రాకపోకలు మాత్రం కొనసాగుతున్నాయి. ఖతార్‌ కూడా బుధవారం నుంచి దైనందిన జీవనాన్ని ప్రభావితం చేసే నిషేధాజ్ఞలు విధించింది. తమ దేశంలో కేసుల పెరుగుదల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.

ఇవీ చదవండి..

సౌదీలో అంతర్జాతీయ విమానాల నిలిపివేత

మయన్మార్‌: నిరసనల వెల్లువ, ఫేస్‌బుక్‌పై నిషేధం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని