గోవా ఎవరూ వెళ్లొద్దు!

తాజా వార్తలు

Published : 07/05/2021 21:56 IST

గోవా ఎవరూ వెళ్లొద్దు!

పనాజీ:  దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో తీవ్రతను తగ్గించేందుకు పలు రాష్ట్ర్రాలు లాక్‌డౌన్‌, కర్ఫ్యూల వైపు దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాల్లో పలు ఆంక్షలు అమల్లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో గోవా కూడా చేరింది. పర్యాటకం ఎక్కువగా ఉండే ఈ రాష్ట్రంలో మే 9( ఆదివారం) నుంచి 15 రోజుల పాటు పూర్తి కర్ఫ్యూ విధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

అత్యవసర సేవలతో సంబంధం ఉన్న దుకాణాలను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తెరచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల మధ్య ‘ఫుడ్‌ హోం డెలివరీ’ సదుపాయం అందుబాటులో ఉంటుందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ తెలిపారు. రాష్ట్రంలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు గురువారమే సీఎం చెప్పకనే చెప్పారు. రాష్ట్రంలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించే అవకాశముందన్నారు. అన్ని వర్గాల వారితో చర్చించిన తర్వాత తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత వారంలోనూ రాష్ట్రంలో నాలుగు రోజులపాటు పూర్తి లాక్‌డౌన్‌ విధించారు.

మరోవైపు పొరుగు రాష్ట్రంలో కర్ణాటకలోనూ కరోనా ఉద్ధృతిని తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటి వరకు వారాంతపు లాక్‌డౌన్‌, రాత్రిపూట కర్ఫ్యూ విధించిన కర్ణాటక ప్రభుత్వం రెండు వారాల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని