మేఘాలయ గవర్నర్‌గా సత్యపాల్‌ మాలిక్‌

తాజా వార్తలు

Published : 18/08/2020 23:19 IST

మేఘాలయ గవర్నర్‌గా సత్యపాల్‌ మాలిక్‌

దిల్లీ: మేఘాలయ గవర్నర్‌గా సత్యపాల్‌ మాలిక్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు పనిచేసిన గవర్నర్‌ తథాగత రాయ్‌ పదవీకాలం ముగియడంతో గోవా గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ను నియమిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్‌ మంగళవారం వెల్లడించింది. మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీకి గోవా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు రాష్ట్రపతి భవన్‌ పేర్కొంది. సత్యపాల్‌ మాలిక్‌ 2019 నుంచి గోవా గవర్నర్‌గా పనిచేస్తున్నారు. అంతకముందు ఆయన జమ్మూ కశ్మీర్‌ గవర్నర్‌గా విధులు నిర్వహించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని