కుడి.. ఎడమేదో తెలియదట! అందుకే ఈ పచ్చబొట్టు!

తాజా వార్తలు

Updated : 24/02/2021 10:18 IST

కుడి.. ఎడమేదో తెలియదట! అందుకే ఈ పచ్చబొట్టు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్నతనం నుంచే పిల్లలకు మనం సమయం చూసుకోవడం.. దిక్కులు ఎన్ని ఉన్నాయి.. కుడివైపు అంటే ఎటు? ఎడమవైపు అంటే ఎటు? వంటి నిత్య జీవితంలో ఉపయోగపడే అనేక అంశాలను నేర్పిస్తాం. పిల్లలూ ఇలాంటి విషయాలను తొందరగానే నేర్చుకుంటారు. కానీ, ఆస్ట్రేలియాకు చెందిన 23ఏళ్ల ఓ యువతి ఇప్పటికీ కుడి వైపు, ఎడమ వైపు విషయంలో తికమకపడుతుందట. అందుకే ఇవి గుర్తుండే విధంగా తన ఎడమ చేతి బొటన వేలు కింద ‘L’ (లెఫ్ట్‌) అని, కుడి చేతి బొటన వేలు కింద ‘R’ (రైట్‌) అని శాశ్వత పచ్చబొట్టు వేయించుకుంది.

కాన్‌బెర్రాలో నివసించే డి కొడియా లైన్‌.. చిన్నతనం నుంచే కుడి, ఎడమ వైపులను సరిగా గుర్తించలేదు. చాలా సార్లు ప్రయాణాల్లో దారి చూపే క్రమంలో కుడి వైపు తిరగాల్సిన చోట ఎడమవైపు అని.. ఎడమవైపు తిరాగాల్సిన చోటు కుడివైపు అని  కారు డ్రైవర్లకు తప్పుదోవ చూపించి ఇబ్బందులు పడింది. ఓ సారి డి కొడియా ఇలాగే దారి చూపడంలో ఇబ్బంది పడటం చూసిన ఆమె స్నేహితురాలు పెన్నుతో ఎడమ చేతిపై లెఫ్ట్‌ అని.. కుడి చేతిపై రైట్‌ అని రాసి వాటిని పచ్చబొట్టుగా వేయించుకో.. ఎప్పటికీ గుర్తుండిపోతుందని కోపంగా అందట. కానీ, డి కొడియాకు అది మంచి ఆలోచనగా తోచింది. నిజంగానే చేతిపై కుడి, ఎడమను సూచించే విధంగా సింబల్స్‌ను పచ్చబొట్టుగా వేయించుకుంటే తన సమస్యకు పరిష్కారం లభించినట్లేనని అనుకుంది. ఈ మేరకు డి కొడియా ఇటీవల తన చేతులపై L, R అక్షరాలను పచ్చబొట్టుగా వేయించుకుంది. ఇప్పుడు తనకు ఎలాంటి గందరగోళం లేదని.. దారి చూపాల్సి వచ్చినప్పుడు తికమకపడకుండా తన చేతిని చూపిస్తే సరిపోతుందని డి కొడియా చెప్పుకొచ్చింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని