అమెరికాలో కాల్పులు.. 8మంది మృతి

తాజా వార్తలు

Updated : 17/03/2021 12:05 IST

అమెరికాలో కాల్పులు.. 8మంది మృతి

అట్లాంటా: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. అట్లాంటా ప్రాంతంలోని వేర్వేరు మసాజ్‌ పార్లర్లపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనల్లో 8 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు.

అట్లాంటా పోలీసు చీఫ్‌ ర్యాంట్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అట్లాంటాలోని బకెడ్‌, చెరోకీకౌంటీ ప్రాంతాల్లోని మూడు వేర్వేరు మసాజ్‌ పార్లర్‌పై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఆరుగురు మహిళలే కాగా.. వారు ఆసియాకు చెందిన వారు అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ కాల్పులకు సంబంధించి రాబర్ట్‌ ఆరోన్‌ అనే అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మసాజ్‌ పార్లర్లనే లక్ష్యంగా చేసుకోవడంతో.. ఆయా ప్రాంతాల్లోని మిగతా కేంద్రాల వద్ద పోలీసులు భద్రత పెంచారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని