అఫ్గాన్‌ పరిస్థితికి అమెరికాదే బాధ్యత

తాజా వార్తలు

Updated : 20/08/2021 06:36 IST

అఫ్గాన్‌ పరిస్థితికి అమెరికాదే బాధ్యత

జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ సహచరుడు

బెర్లిన్‌: అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితికి అమెరికాయే బాధ్యత వహించాలని జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ నాయకత్వం వహిస్తున్న సెంటర్‌-రైట్‌ యూనియన్‌ బ్లాక్‌లోని నాయకుడు మార్కస్‌ సోడ పేర్కొన్నారు. ‘‘అఫ్గాన్‌ నుంచి సేనలను ఉపసంహరించుకోవాలన్న నిర్ణయం అమెరికాయే తొందరపడి తీసుకుంది. కాబట్టి ఈ పరిస్థితికి ఆ దేశానిదే ప్రధాన బాధ్యత’’ అని తెలిపారు. శరణార్థుల విషయంలోనూ అగ్రరాజ్యం జాగ్రత్తలు తీసుకోవాలని, అఫ్గాన్‌ పొరుగు దేశాలకు సాయం చేయాలని కోరారు. 2015లో ఆసియా, ఆఫ్రికా నుంచి ఐరోపాకు శరణార్థులు వలస వచ్చారని, అలాంటి సంక్షోభం తలెత్తకుండా అమెరికా చూసుకోవాలని చెప్పారు.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని