బెజోస్‌ రాకెట్‌ రూపశిల్పుల్లో భారత మహిళా ఇంజినీరు

తాజా వార్తలు

Updated : 18/07/2021 06:58 IST

బెజోస్‌ రాకెట్‌ రూపశిల్పుల్లో భారత మహిళా ఇంజినీరు

ముంబయి: అమెజాన్‌ వ్యవస్థాపకుడు, బిలియనీర్‌ జెఫ్‌ బెజోస్‌ను ఈ నెల 20న రోదసిలోకి తీసుకెళ్లే ‘న్యూ షెపర్డ్‌’ రాకెట్‌ వ్యవస్థను నిర్మించిన ఇంజినీర్ల బృందంలో భారత్‌కు చెందిన 30 ఏళ్ల సంజల్‌ గవాండే కూడా ఉన్నారు. మహారాష్ట్రలోని కల్యాణ్‌ ప్రాంతానికి చెందిన ఆమె.. బెజోస్‌కు సంబంధించిన అంతరిక్ష సంస్థ ‘బ్లూ ఆరిజిన్‌’లో పనిచేస్తున్నారు. సంజల్‌.. ముంబయి విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలోని మిషిగన్‌ టెక్నోలాజిక్‌ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్‌ పట్టా అందుకున్నారు.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని