Japan: జపాన్‌లో వెల్లువెత్తిన బురద

తాజా వార్తలు

Updated : 04/07/2021 12:01 IST

Japan: జపాన్‌లో వెల్లువెత్తిన బురద

19 మంది గల్లంతు.. కొట్టుకుపోయిన కార్లు

టోక్యో: జపాన్‌లోని టోక్యో నగరానికి పశ్చిమాన వంద కి.మీ. దూరాన ఉన్న సముద్రతీర పట్టణం అటామిలో శనివారం కురిసిన భారీవర్షంతో వరదనీరు, ఇళ్ల శిథిలాలతో కూడిన బురదమట్టి వెల్లువలా వచ్చింది. ఈ తాకిడికి దాదాపు 80 ఇళ్లు పూర్తిగా పూడుకుపోగా, 19 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఈ సంఖ్య వంద వరకు ఉండొచ్చని సమాచారం. సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా జపాన్‌ వ్యాప్తంగా పలుచోట్ల కురుస్తున్న భారీవర్షాలకు దేశంలో లోయలు, పర్వతాలతో కూడిన ప్రాంతాల్లో మట్టి వదులుగా మారి ఉంటుందని నిపుణులు తెలిపారు. కొన్నిచోట్ల కార్లు కొట్టుకుపోయాయి. జనం భీతావహులై నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. కొంతమంది ఈ దృశ్యాలను సెల్‌ఫోన్లతో చిత్రీకరించారు.



Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని