Corona: ట్రంప్‌ డిమాండుకు చైనా తిరస్కరణ

తాజా వార్తలు

Published : 08/06/2021 07:51 IST

Corona: ట్రంప్‌ డిమాండుకు చైనా తిరస్కరణ

బీజింగ్‌: కరోనా కారణంగా నష్టపోయిన అమెరికాతోపాటు ప్రపంచానికి 10 ట్రిలియన్‌ డాలర్లు (సుమారు రూ.700 లక్షల కోట్లు) పరిహారంగా చెల్లించాలంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన డిమాండును సోమవారం చైనా తిరస్కరించింది. శనివారం నార్త్‌ కరోలినాలో జరిగిన రిపబ్లికన్‌ పార్టీ సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ కరోనాను చైనా వైరస్‌, వుహాన్‌ వైరస్‌ అని అభివర్ణించారు. ఇందుకు చైనాయే బాధ్యత తీసుకొని, భారీ పరిహారం చెల్లించాలని డిమాండు చేశారు. దీనిపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ ఇక్కడ స్పందిస్తూ మహమ్మారి వ్యాప్తికి ప్రజల జీవితాలు, ఆరోగ్యాన్ని పట్టని రాజకీయ నాయకులదే బాధ్యత అని అన్నారు. వైరస్‌ వ్యాప్తిపై చేసిన హెచ్చరికలను ట్రంప్‌ విస్మరించారని ఆరోపించారు. ఆయన హయాంలో 2.4 కోట్ల మంది వైరస్‌కు గురి కాగా, 4.10 లక్షల మంది మరణించారని చెప్పారు. దీనికి బాధ్యత ఎవరన్నదానిపై అమెరికా ప్రజలే సమాధానం చెప్పారని వ్యాఖ్యానించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని