Lottery: యూఏఈలో భారతీయులకు రూ.20 కోట్ల లాటరీ

తాజా వార్తలు

Updated : 05/10/2021 13:51 IST

Lottery: యూఏఈలో భారతీయులకు రూ.20 కోట్ల లాటరీ

దుబాయ్‌: హైపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్న 40 మంది బృందానికి రూ.20.26కోట్ల విలువైన లాటరీ తగిలింది. వీరిలో ఇద్దరు బంగ్లాదేశీయులు కాగా మిగిలిన అందరూ భారతీయులే. ఒకే గదిలో నివసిస్తున్న వీరందరూ కలిసి కేరళకు చెందిన నహీల్‌ నిజాముద్దీన్‌ పేరుతో యూఏఈలో లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. కరోనా నేపథ్యంలో నహీల్‌ నిజాముద్దీన్‌ను స్వదేశానికి తిప్పి పంపించారు. దీంతో లాటరీ నిర్వాహకులు నహీల్‌ను సంప్రదించలేకపోయారని ఖలీజ్‌టైమ్స్‌ పత్రిక తెలిపింది. నహీల్‌ ఇచ్చిన తల్లిదండ్రుల ఫోన్‌ నంబరు ఆధారంగా లాటరీ గెల్చుకున్న విషయాన్ని నిర్వాహకులు తెలియజేశారని పత్రిక పేర్కొంది. లాటరీ ద్వారా లభించిన మొత్తాన్ని 40 మంది పంచుకోనున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని