Marriage: కట్నంగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు!

తాజా వార్తలు

Updated : 06/07/2021 12:37 IST

Marriage: కట్నంగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు!

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన ఓ కుటుంబం తమ కుమార్తె వివాహం సందర్భంగా వరుడికి కట్నంగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను ఇచ్చింది! వీటిని అవసరమైన వారికి ఉచితంగా అందిస్తామని వధూవరులు ప్రతిజ్ఞ చేయడం విశేషం. సుధీర్‌ గోయల్‌ అనే వ్యక్తి... ఉజ్జయినిలో సేవాధామ్‌ ఆశ్రమాన్ని స్థాపించి, సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తన కుమార్తె వివాహాన్ని కూడా సేవా కార్యక్రమాలకు వేదికగా చేయాలనుకున్నా రు. కొత్త అల్లుడికి ఎనిమిది హామీలు ఇచ్చారు. అందులో ఒకటి... రెండు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను కానుకగా ఇవ్వడం. ఆ మేరకు రూ.1.40 లక్షలతో వాటిని కొనుగోలుచేసి, పెళ్లి వేదిక వద్దే వరుడికి అందించారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని