Prison: ఖైదీలతోనే విచ్చలవిడి శృంగారం

తాజా వార్తలు

Updated : 05/07/2021 10:19 IST

Prison: ఖైదీలతోనే విచ్చలవిడి శృంగారం

 దొరికిపోయిన 26 ఏళ్ల జైలు అధికారిణి 

కాలిఫోర్నియాలో సంచలనం సృష్టించిన కేసు

కాలిఫోర్నియా: ఆమె ఖైదీల్లో మార్పులు తేవాల్సిన అధికారి. వారు తప్పు చేస్తే కౌన్సెలింగ్‌ ఇచ్చి మంచి మార్గంవైపు నడిపించాలి. అలాంటి ఆమే.. నిబంధనలు గాలికి వదిలి ఖైదీలతో బహిరంగ శృంగార కార్యకలాపాలు చేస్తూ జైల్లో విచ్చలవిడిగా ప్రవర్తించింది. కాలిఫోర్నియాలో సంచలనం సృష్టించిన ఈ కేసులో ప్రెస్నో కౌంటీలోని సవరణ అధికారిణి టీనా గొంజాలెజ్‌ (26)కు న్యాయస్థానం రెండేళ్ల ప్రొబేషన్, ఏడు నెలల జైలు శిక్ష విధించింది. 2016 నుంచి కౌంటీ జైల్లో పని చేస్తున్న టీనా.. ఖైదీలతో తనకు నచ్చిన సమయంలో విచ్చలవిడిగా శృంగార కార్యకలాపాల్లో పాల్గొనేది. ఓ సారి 11 మంది ఖైదీలు చూస్తుండగా... ఓ ఖైదీతో సెక్స్‌లో పాల్గొంది. అంతేకాదు.. ఆమె ఖైదీలకు సెల్‌ఫోన్లు, బ్లేడులు సరఫరా చేసిందని, జైల్లో సోదాలు జరిగేటపుడు వారిని ముందస్తుగా హెచ్చరించేదని జైలు అధికారి కోర్టుకు తెలిపారు. ఫోన్లలో ఖైదీలతో అసభ్యకరంగా మాట్లాడుతూ, తాను చేసిన నేరాల గురించి వారితో గొప్పగా చెప్పుకొనేదని ఆ అధికారి తెలిపారు. ఆమె ప్రవర్తనకు న్యాయమూర్తి షాక్‌కు గురయ్యారు ‘‘నువ్వు దారుణంగా ప్రవర్తించావు. నీ కెరీర్‌ను సర్వనాశనం చేసుకున్నావు’’ అని వ్యాఖ్యానించారు. ఆమెకు గత నేరచరిత్ర లేకపోవడంతో శిక్షను తగ్గించారు. రెండేళ్ల ప్రొబేషన్, ఏడు నెలల జైలుకు పరిమితం చేశారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని