Corona: మిశ్రమ డోసులు సురక్షితమే కానీ..
close

తాజా వార్తలు

Published : 14/05/2021 09:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: మిశ్రమ డోసులు సురక్షితమే కానీ..

దుష్ప్రభావాలు పెరుగుతాయి 
బ్రిటన్‌ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి

లండన్‌: కొవిడ్‌-19 నివారణ కోసం భిన్న కంపెనీలు భిన్న రకాల వ్యాక్సిన్లను రూపొందిస్తున్నాయి. మొదటి డోసు కింద పొందిన కంపెనీ టీకానే రెండో డోసులోనూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటిని కలగలిపి, రెండు వేర్వేరు సంస్థల టీకాలను పొందడమూ సురక్షితమేనని బ్రిటన్‌లో నిర్వహించిన తాజా అధ్యయనం పేర్కొంది. కాకుంటే దీనివల్ల స్వల్పస్థాయిలో తలెత్తాల్సిన దుష్ప్రభావాలు.. ఒకమోస్తరు స్థాయికి పెరుగుతాయని తెలిపింది. వీటిలో చలి, అలసట, తలనొప్పి, జ్వరం వంటివి ఉంటాయని పేర్కొంది. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ఈ పరిశోధనను నిర్వహించింది. ఈ వివరాలు ప్రముఖ వైద్య పత్రిక ‘లాన్సెట్‌’లో ప్రచురితమయ్యాయి. పరిశోధనలో భాగంగా వాలంటీర్లకు ఒక డోసు కింద ఆక్స్‌ఫర్డ్‌/ఆస్ట్రాజెనెకా టీకాను, మరో డోసు కింద ఫైజర్‌/బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌ను శాస్త్రవేత్తలు ఇచ్చారు. దీనివల్ల దుష్ప్రభావాలు తలెత్తినప్పటికీ అవి ఎక్కువ కాలం కొనసాగలేదని చెప్పారు. సురక్షిత ప్రమాణాలకు సంబంధించి ఇతరత్రా సమస్యలేమీ ఉత్పన్నం కాలేదని తెలిపారు. అయితే మిశ్రమ టీకాల వల్ల ప్రజల్లో తలెత్తే సమస్యల గురించి శోధించడానికే ఈ పరిశోధన పరిమితమైనట్లు చెప్పారు. వీటివల్ల రోగనిరోధక వ్యవస్థ ఎలా స్పందిస్తుందన్నది తాము పరిశీలించలేదని వివరించారు. ‘‘మిశ్రమ డోసుల వల్ల.. టీకా పొందిన మరుసటి రోజు సదరు వ్యక్తి విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోంది. ఆరోగ్య కార్యకర్తలకు ఈ తరహాలో వ్యాక్సిన్లు ఇచ్చే ముందు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి’’ అని పరిశోధనలో పాల్గొన్న మాథ్యూ స్నేప్‌ చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని