ఆమె మేను పరాధీనం!

తాజా వార్తలు

Published : 16/04/2021 10:42 IST

ఆమె మేను పరాధీనం!

శృంగారాన్ని నిరాకరించే హక్కు మహిళలకు కరవు 
ఐరాస నివేదికలో ఆందోళనకర అంశాలు 

ఐరాస: భాగస్వాములతో శృంగారంలో పాల్గొనాలో వద్దో స్వతంత్రంగా నిర్ణయించుకునే హక్కు మహిళలకు కరవవుతోందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ఒకటి ఆందోళన వ్యక్తం చేసింది. గర్భనిరోధక సాధనాలు వినియోగించడం, ఆరోగ్య సేవలు పొందడం వంటి విషయాల్లోనూ వారికి నిర్ణయాధికారం ఉండటం లేదని వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న 57 దేశాల్లో పరిస్థితులను అధ్యయనం చేసిన అనంతరం ‘ఐరాస జనాభా నిధి (యూఎన్‌పీఎఫ్‌)’ ఈ నివేదికను విడుదల చేసింది. కోట్ల మంది మహిళలు, బాలికలకు శారీరక స్వతంత్రత లేదని అందులో ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘శారీరక స్వతంత్రతను నిరాకరించడమంటే మహిళలు, బాలికల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే. అసమానతలకు, లింగ వివక్ష ఆధారిత హింసకు అది దారితీస్తుంది’’ అని యూఎన్‌పీఎఫ్‌ కార్యనిర్వాహక సంచాలకురాలు డాక్టర్‌ నటాలియా కానెమ్‌ పేర్కొన్నారు. 
నివేదికలోని కీలక అంశాలివీ.. 
శృంగారంలో పాల్గొనడం, గర్భనిరోధక సాధనాలు వినియోగించడం, ఆరోగ్య సేవలు పొందడం వంటి విషయాల్లో 55 శాతం మంది బాలికలు, మహిళలు మాత్రమే స్వతంత్రంగా నిర్ణయం తీసుకోగలుగుతున్నారు. 
తూర్పు ఆసియా, ఆగ్నేయాసియాల్లో 76% కిశోరప్రాయ బాలికలు, మహిళలు శారీరక స్వతంత్రతను కలిగి ఉండగా.. సబ్‌ సహారన్‌ ఆఫ్రికా, మధ్య ఆసియా, దక్షిణ ఆసియాల్లో వారి శాతం 50 కంటే తక్కువగా ఉంది. 
సబ్‌ సహారన్‌ ఆఫ్రికాలోని మాలి, నైగర్, సెనగల్‌లలో శారీరక స్వతంత్రతను కలిగి ఉన్న బాలికలు, మహిళల సంఖ్య 10% కంటే తక్కువే. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని