close

తాజా వార్తలు

Updated : 05/12/2020 06:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తేనె కల్తీపై పరిశోధన వివరాలివిగో..!

దిల్లీ: ప్రముఖ బ్రాండ్లు విక్రయిస్తున్న తేనెల్లో కల్తీకి సంబంధించి తాము జరిపిన పరిశోధనల వివరాలను భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)కి అందజేసినట్లు శాస్త్ర, పర్యావరణ కేంద్రం (సీఎస్‌ఈ) శుక్రవారం వెల్లడించింది. కల్తీ గుట్టును వెలుగులోకి తెచ్చేందుకు తాము అనుసరించిన విధానాలన్నిటినీ సంస్థ అధికారులకు వివరించామని ఒక ప్రకటలో పేర్కొంది. ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ తనిఖీలకు అందని రీతిలో, ఆధునిక రూపంలో తేనె కల్తీ ఉంటోందని సీఎస్‌ఈ వెల్లడించిన విషయం తెలిసిందే. చైనా కంపెనీలు తాము తయారు చేస్తున్న ఫ్రక్టోజ్‌, గ్లూకోజ్‌ను భారత్‌కు ఎగుమతి చేస్తున్నట్లు బహిరంగంగానే పేర్కొంటున్నాయి. గత కొన్నేళ్లలో 11వేల టన్నుల సరకు మన దేశానికి వచ్చింది. ఈ వ్యవహారమంతా ఆన్‌లైన్‌ ఆర్డర్ల ద్వారా జరుగుతోందని, మన దేశంలో ‘ఆల్‌-పాస్‌ సిరప్‌’ పేరుతో లభిస్తుందని సీఎస్‌ఈ వివరించింది. చైనాతో పాటు ఉత్తరాఖండ్‌లోని జస్‌పుర్‌లో ఉన్న ఓ కర్మాగారం నుంచి కూడా తాము ఆ సిరప్‌ను సేకరించినట్లు తెలిపింది. కిలో రూ.53-68లకే లభిస్తోందని, పెద్ద మొత్తంలో ఆర్డరిస్తే ఇంతకన్నా తక్కువ ధరకే ఆ సిరప్‌ను పొందవచ్చని తమ పరిశీలనలో తేలిందని సీఎస్‌ఈకి చెందిన ఆర్ణబ్‌ దత్తా వివరించారు. జర్మనీలో ఉన్న ప్రపంచ ప్రముఖ ప్రయోగశాలలో న్యూక్లియర్‌ మ్యాగ్నెటిక్‌ రిసోనెన్స్‌ స్పెక్ట్రోస్కోపీ(ఎన్‌ఎంఆర్‌) పరీక్ష ద్వారా తేనె నమూనాలను పరిశీలించినట్లు తెలిపారు. కల్తీకి పాల్పడుతున్న వారిపై సత్వరమే చర్యలు తీసుకొనేందుకు వీలుగా, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అభ్యర్థన మేరకు సంబంధిత పత్రాలను, పరీక్షల వివరాలను ఆ సంస్థకు అందించినట్లు వివరించారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని