close

తాజా వార్తలు

Published : 20/09/2020 13:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత్‌-నేపాల్‌ మధ్య తొలిసారిగా

ప్యాసింజర్‌ రైళ్ల పరుగులు..!
పొరుగుదేశానికి రెండు రైళ్ల బహూకరణ

కాఠ్‌మండూ: భారత్‌-నేపాల్‌ మధ్య తొలిసారిగా ప్యాసింజర్‌ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. నేపాల్‌కు ఆధునిక సదుపాయాలున్న రెండు ‘డీజిల్‌-ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్‌(డీఎంసీయూ)’ రైళ్లను శుక్రవారం భారత్‌ అందజేసింది. బిహార్‌లోని జయనగర్, నేపాల్‌లోని ధనుసా జిల్లాలోని కుర్తాల మధ్య 35 కిలోమీటర్ల పొడవున తొలిసారిగా నిర్మించిన బ్రాడ్‌ గేజ్‌ రేల్వే మార్గంలో ఈ రైళ్ల రాకపోకలు జరగనున్నాయి. డిసెంబరు నుంచి ఈ రైళ్ల సేవలు ప్రారంభం కానున్నట్లు అధికారులు శనివారం తెలిపారు. కొవిడ్‌ ప్రభావం పూర్తిగా తగ్గిపోయి ఇరు దేశాల మధ్య నిరంతర రాకపోకలు ప్రారంభమయ్యే వరకూ నిర్వహణ, భద్రతా కారణాల రీత్యా ఈ రైళ్లను నేపాల్‌లోని జయనగర్‌ రైల్వేస్టేషన్‌లోనే ఉంచనున్నట్లు అక్కడి సీనియర్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ దేవేంద్ర షా తెలిపారు. అయితే శుక్రవారం నిర్వహించిన ట్రయల్‌ రన్‌లో భాగంగా భారత్‌ నుంచి ఈ రైళ్లలో నేపాల్‌ చేరుకున్న భారతీయ సాంకేతిక నిపుణులకు, ఆ దేశ రైల్వే అధికారులకు పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలికారు. ఓ వైపు కరోనా విలయం కొనసాగుతున్నప్పటికీ భారత్‌ నుంచి వచ్చిన కొత్త రైళ్లను చూడటానికి వేలాది ప్రజలు తరలివచ్చారు. ఈ రైళ్ల సేవలతో ఇరు దేశాల ప్రజలూ లబ్ది పొందుతారని భారత రాయబారి కార్యాలయ వర్గాలు అభిప్రాయపడ్డాయి.             


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.